LOADING...
Tollywood : యూట్యూబ్‌లో 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90's తరానికి గుర్తుండిపోయే పాట ఇదే!
యూట్యూబ్‌లో 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90's తరానికి గుర్తుండిపోయే పాట ఇదే!

Tollywood : యూట్యూబ్‌లో 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90's తరానికి గుర్తుండిపోయే పాట ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 17, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఈ వారంలో నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ బడ్జెట్‌తో, భారీ హైప్‌తో తెరకెక్కిన చిత్రాలు అడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే చిన్న స్థాయి కంటెంట్ చిత్రాలు కూడా థియేటర్లలో మంచి సందడి సృష్టిస్తున్నాయి. అయితే, మీరు గమనించారా.. దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం విడుదలైన ఓ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 5 అవార్డులు, 3 జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రం జాతీయవాదం నేపథ్యంతో రూపొందించబడింది. అప్పట్లోనే ఈ సినిమా అడియన్స్‌ దృష్టిని ఆకర్షించింది. ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఈ మూవీలోని పాటలు యూట్యూబ్‌లో హిట్‌గా కొనసాగుతున్నాయి. సినిమా పేరు 'రోజా'. 1992లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌లో సంచలనం సృష్టించింది.

Details

ఈ సినిమాలోని ప్రతిపాట సూపర్ హిట్

చిత్రంలో అరవింద్ స్వామి, మధుబాల, నాజర్, జనగరాజ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో కవితాలయ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేసింది. సంగీతం అందించిన ఏ.ఆర్. రెహమాన్ మొదటి సినిమాతోనే యావత్ దేశాన్ని తనవైపుకు తిప్పాడు. రోజా సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్‌గా నిలిచింది. మధుబాల అందం, అభినయం ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. తమిళనాడులోని కడికోడికి చెందిన ఒక మహిళ జీవితం ఆధారంగా ఈ కథ రూపొందించబడింది. జైలుపాలైన భర్తను తిరిగి తీసుకురావడానికి ప్రేమ, ఆప్యాయత, ఆశలతో ఈ సినిమా సాగుతుంది,

Details

సంగీత దర్శకుడికి మూడు ఫీల్మ్ ఫేర్ అవార్డులు

అలాగే రాజకీయ మలుపులు కూడా చూపబడతాయి. ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 2005లో టైమ్ మాగజైన్ ఈ సినిమా సాంగ్స్‌ను 10 ఉత్తమ పాటల జాబితాలో చేర్చింది. మొత్తం 11 పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి.

Advertisement