Chittibabu: టాలీవుడ్ సినీ నిర్మాత,దర్శకుడు,విశ్లేషకులు చిట్టిబాబు మృతి..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ నిర్మాత,విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రఖ్యాత రచయిత త్రిపురనేని మహారథి కుమారుడైన చిట్టిబాబు 1955 జూలై 28న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం చెన్నైలో పూర్తిచేశారు.
వివరాలు
12 సినిమాలకు దర్శకత్వం
చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన సినీ రంగంలో అడుగుపెట్టారు. మొదట కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన, తర్వాత 'సంతానం' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తన ప్రయాణంలో మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా దాదాపు 30 చిత్రాల్లో నటుడిగా తెరపై కనిపించారు. ఆపై నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి పలు చిత్రాలను నిర్మించి తన ముద్ర వేశారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు.