
Vishwambhara: 'విశ్వంభర' సినిమాలో అవని పాత్రలో త్రిష.. నూతన పోస్టర్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara)లో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుత చిత్రీకరణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆదివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఆమె పాత్రను పరిచయం చేస్తూ, అవని పాత్రలో త్రిష కనిపించనుందనే విషయాన్ని ప్రకటించారు. ఈ పాత్రలో ఆమె చీరకట్టులో కనిపిస్తున్న లుక్‌ను రివీల్ చేసింది.
2006లో విడుదలైన 'స్టాలిన్' తర్వాత చిరంజీవి - త్రిష కలిసి పని చేస్తున్న చిత్రం ఇది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
చిత్రీకరణ జరిపినా, డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
Details
వరుస సినిమాలతో త్రిష బిజి
చిరంజీవి ఈ చిత్రంలో హనుమాన్ భక్తుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల చిత్రంలోని తొలిపాట విడుదలైంది. నాలుగు పదుల వయసులోనూ కెరీర్ పరంగా మంచి విజయాలు సాధిస్తున్న త్రిష, కోలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
ఈ ఏడాదిలోనే ఆమె మూడు చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం 'థగ్ లైఫ్', 'సూర్య 45', 'రామ్' వంటి ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు.