Trisha: 'త్రిష ఉంటే హిట్ పక్కా'.. నెటిజన్ పోస్టును షేర్ చేసిన స్టార్ హీరోయిన్
ఈ వార్తాకథనం ఏంటి
అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆసక్తికరమైన పోస్ట్‌ను త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవడం మరింత చర్చకు దారితీసింది. ఆ పోస్ట్‌లో విజయ్, అజిత్ కుమార్, సూర్య కెరీర్‌లలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటించారని పేర్కొన్నారు. ఆ హీరోల బ్లాక్‌బస్టర్ విజయాల వెనుక త్రిష మ్యాజిక్ కూడా ఉందని అభిమానులు కామెంట్ చేశారు. ఈ పోస్ట్‌ను షేర్ చేసిన త్రిష హార్ట్ ఎమోజీతో పాటు 'థాంక్యూ' అని స్పందించారు.
వివరాలు
విజయ్ కెరీర్‌లో 'లియో' టాప్
లియో చిత్రం ప్రస్తుతం విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 2023లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటించారు. అజిత్‌కు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' బిగ్గెస్ట్ హిట్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం అజిత్ కుమార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 2025లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా రూ.248 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో కూడా త్రిష కీలక పాత్రలో కనిపించారు.
వివరాలు
సూర్యకు 'కరుప్పు'తో కమ్‌బ్యాక్
వరుస ఫ్లాప్‌ల తర్వాత సూర్యకు కరుప్పు చిత్రం మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఇందులో సూర్యకు జోడీగా త్రిష లాయర్ ప్రీతి పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూడు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో త్రిష హీరోయిన్‌గా నటించడంతో అభిమానులు ఆమెను 'లక్కీ ఛార్మ్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం త్రిష టాలీవుడ్‌లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె 'అవని' పాత్రలో కనిపించనున్నారు.