LOADING...
Trisha: 'మీ ప్రేమ అమూల్యం'.. ఇది నా హ్యాపీ ప్లేస్‌: త్రిష పోస్ట్‌ వైరల్
'మీ ప్రేమ అమూల్యం'.. ఇది నా హ్యాపీ ప్లేస్‌: త్రిష పోస్ట్‌ వైరల్

Trisha: 'మీ ప్రేమ అమూల్యం'.. ఇది నా హ్యాపీ ప్లేస్‌: త్రిష పోస్ట్‌ వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

కొన్ని రోజులుగా నటి త్రిష పేరు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేక ఫొటోలను పంచుకున్నారు. ఇంతమంది ప్రేమను పొందడం ఎంతో ఆనందంగా ఉందని త్రిష తన సామాజిక మాధ్యమ ఖాతాలో వెల్లడించారు. ''మీ అందరూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు. ఎప్పటికీ వినమ్రంగా ఉంటాను'' అని ఆమె ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఇక పుట్టినరోజు రోజున త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్తున్న దృశ్యాలను పంచుకుంటూ, తిరుమల తనకు ఎంతో ఇష్టమైన స్థలమని పేర్కొన్నారు. ఈ దృశ్యాలు కూడా విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి.

వివరాలు 

యూనివర్స్ నీకు మంచి గిఫ్ట్‌ ఇచ్చింది: మంచు లక్ష్మి 

త్రిష పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు పంపిన శుభాకాంక్షలు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. నటి రాధిక ప్రేమాభిమానాలతో శుభాకాంక్షలు తెలియజేయగా,వరలక్ష్మి శరత్‌కుమార్ ఇది ఆమెకు అత్యుత్తమ పుట్టినరోజు అని అభిప్రాయపడ్డారు. 'ఈ పుట్టినరోజు చిరస్థాయిలో నిలిచిపోతుంది' అని చార్మి విష్‌ చేశారు. యూనివర్స్ నీకు మంచి గిఫ్ట్‌ ఇచ్చిందని మంచు లక్ష్మి అన్నారు ఇక మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని పార్టీ భారీ ప్రభంజనం సృష్టిస్తూ 234 స్థానాల్లో 108 స్థానాలను దక్కించుకుంది.

Advertisement