Trisha : హీరోయిన్ త్రిష కేసులో మన్సూర్ అలీఖాన్ అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు
దక్షిణాది స్టార్ కథానాయకి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు మన్సూర్ అలీఖాన్‌పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. National Women Commission(NWC) జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. ఓ కార్యక్రమంలో హీరోయిన్ త్రిషపై, నటుడు మన్సూర్ అలీఖాన్ తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో నటుడి వ్యాఖ్యలు సీరియస్'గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ కేసును సుమోటోగా స్వీకరించింది. మన్సూర్ అలీఖాన్ పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి, అక్కడి పోలీసులకు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మేరకు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
నేనే తప్పు మాట్లాడలేదు : మన్సూర్ అలీఖాన్
తాజాగా దీనిపై ప్రెస్‌మీట్‌లో స్పందించిన మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్పనబోనన్నారు. అసలు తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, తన గురించి తమిళనాట అందరికీ తెలుసన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల మద్దతు తనకు ఉందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటనలో భాగంగా హత్య చేస్తే నిజంగానే చేసినట్లా అని ప్రశ్నించారు. సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా అన్నారు. ఇదే సమయంలో మన్సూర్ అనుచిత వ్యాఖ్యలపై దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్(నడిగర్ సంఘం) ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. మరోవైపు సోషల్‌మీడియాలో త్రిషకు మద్దతుగా చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఇటువంటి పరిస్థితులు ఏ ఆడపిల్ల ఎదుర్కొంటున్నా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.