ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా: పురాణాలను టచ్ చేస్తూ పాన్ ఇండియా మూవీ
ఈ వార్తాకథనం ఏంటి
త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత, సినిమా అభిమానులు అందరికీ తెగ నచ్చేసింది. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ మార్క్ దర్శకత్వం, మాటలు అందరినీ అలరించాయి.
అందుకే మరోమారు వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అభిమానులు ఆశించారు. ప్రస్తుతం అది నిజమయ్యే అవకాశం వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలియజేసారు.
ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగవంశీ, ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందనీ, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారనీ, హిందూ పురాణాల ఆధారంగా కథ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
కాకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ వారి పనుల్లో బిజీగా ఉన్నారని, అవి పూర్తయ్యాక మైథాలజీ కాన్సెప్ట్ తో సినిమా మొదలవుతుందని సూటిగా చెప్పేసాడు.
త్రివిక్రమ్
ఇప్పటివరకు మైథాలజీని టచ్ చేయని త్రివిక్రమ్
హిందూ పురాణాల ఆధారంగా రూపొందే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలోని మూవీ, పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. నాగవంశీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే టైమ్ లో కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మైథాలజీని త్రివిక్రమ్ ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఆయన సినిమాల్లో పురాణ కథల్లోని రిఫరెన్సులు చాలానే కనిపిస్తాయి. కానీ పూర్తిగా మైథాలజీ జోనర్ లో సినిమా చేయలేదు.
మరి త్రివిక్రమ్ మైథాలజీని సరిగ్గా డీల్ చేయగలడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో, ఎలాంటి సినిమానైనా త్రివిక్రమ్ డీల్ చేయగలరని, మైథాలజీ మీద గొప్ప పట్టున్న త్రివిక్రమ్, ఇంకా బాగా తీయగలడని సపోర్ట్ చేస్తున్నారు.
ఇదంతా జరగలాంటే ముందు వాళ్ల చేతుల్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలి.