Page Loader
Trivikram-Venkatesh: త్రివిక్రమ్‌-విక్టరీ వెంకటేశ్‌ కాంబోలో సినిమా .. కంఫర్మ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ 
త్రివిక్రమ్‌-విక్టరీ వెంకటేశ్‌ కాంబోలో సినిమా .. కంఫర్మ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ

Trivikram-Venkatesh: త్రివిక్రమ్‌-విక్టరీ వెంకటేశ్‌ కాంబోలో సినిమా .. కంఫర్మ్ చేసిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో,వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా అధికారికంగా ఖరారైంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ గురువారం ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో వెల్లడించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా తరువాత వెంకటేశ్ పూర్తిగా సోలో హీరోగా కనిపించబోతున్న చిత్రం ఇదే కావడం విశేషం. గతంలో వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్','మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ కథను అందించారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలవడం సినీప్రేమికుల్లో భారీ అంచనాలను రేపుతోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్