Salman Khan: గడ్డకట్టే నీటిలో రెండున్నర రోజుల షూటింగ్.. సల్మాన్ ఖాన్ కష్టంపై దర్శకుడు ప్రశంసలు!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సినిమాల కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధపడతానని మరోసారి నిరూపించారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' షూటింగ్‌లో భాగంగా గడ్డకట్టే చల్లని నీటిలో రోజుకు ఆరు గంటల పాటు గడిపారని దర్శకుడు అపూర్వ లఖియా వెల్లడించారు. తడిసిన దుస్తులతోనే భోజనం చేస్తూ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలిపారు.
వివరాలు
సహజత్వం కోసం నిజమైన ప్రదేశంలో షూటింగ్
ఈ సినిమా కోసం తొలుత ముంబైలోని ఓ స్టూడియోలో కీలక సన్నివేశాన్ని చిత్రీకరించాలని చిత్రబృందం భావించిందట.
అయితే సెట్‌లో కాకుండా నిజమైన ప్రదేశంలో షూట్ చేస్తే సన్నివేశం మరింత సహజంగా ఉంటుందని సల్మాన్ సూచించారట.
దీంతో సెప్టెంబర్ చివర్లో చల్లని నీటిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు దర్శకుడు చెప్పారు. ఆ నీటి ఉష్ణోగ్రత దాదాపు సున్నా డిగ్రీలకు దగ్గరగా ఉందని వివరించారు.
సల్మాన్‌తో పాటు ఇతర నటులు చలికి వణికిపోవడం నటన కాదని, నిజంగానే అంతటి చలిని భరించారని పేర్కొన్నారు.
వివరాలు
ఒక్కరోజులో పూర్తి చేయాలనుకుని.. రెండున్నర రోజులు
ఈ సన్నివేశాన్ని ఒక్కరోజులోనే పూర్తి చేయాలని తొలుత భావించినప్పటికీ.. చివరకు రెండున్నర రోజులు పట్టిందని అపూర్వ లఖియా తెలిపారు.
నటీనటులు ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి, తామే ఆ సన్నివేశంలో నటిస్తున్నంతగా చిత్రబృందం సిబ్బంది సైతం చలికి వణికిపోయారని చెప్పారు.
డిసెంబర్ 4న విడుదల
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జియో స్టూడియోస్ ఆల్ ఇండియా పంపిణీ బాధ్యతలు చేపట్టింది. విదేశీ పంపిణీని జీ స్టూడియోస్ నిర్వహిస్తోంది.
'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' 2026 డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.