Gene Hackman: అనుమానాస్పద స్థితిలో ఆస్కార్ విజేత జీన్ హ్యాక్‌మాన్ దంపతుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రెండు సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మాన్ అమెరికాలోని తన నివాసంలో మరణించారని అధికారులు ధృవీకరించారు.
న్యూమెక్సికో రాష్ట్రంలోని శాంటా ఫీ లో ఉన్న తన ఇంట్లో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
అయన భార్య బెట్సీ అరకావా, పెంపుడు కుక్క కూడా అక్కడే మరణించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని శాంటా ఫీ కౌంటీ పోలీసు అధికారి ఆడెన్ మెండోజా ధృవీకరించారు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.
జీన్ హ్యాక్‌మాన్ తన అసాధారణమైన నటనా ప్రతిభతో "ద ఫ్రెంచ్ కనెక్షన్" చిత్రంలో బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
వివరాలు
జీవితం.. సినీ ప్రయాణం
అలాగే, "అన్‌ఫర్గీవెన్" సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా రెండో ఆస్కార్ అందుకున్నారు.
ఆస్కార్ అవార్డులతో పాటు, రెండు బాఫ్టా, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
జీన్ హ్యాక్‌మాన్ 1930లో కాలిఫోర్నియాలో జన్మించారు.తన సినీ ప్రస్థానంలో 100కి పైగా చిత్రాల్లో వివిధ శక్తివంతమైన పాత్రలు పోషించారు.
ఆయన మృతికి కారణం ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
1970,80 దశకాల్లో వచ్చిన "సూపర్‌మాన్"చిత్రాల్లో లెక్స్ లూథర్ అనే ప్రతినాయక పాత్ర పోషించి ఆయన ప్రేక్షకులను అలరించారు.
అలాగే,"రన్ అవే జ్యూరీ","ద కన్వర్జేషన్","ద రాయల్ టీనెన్‌బౌమ్స్"వంటి హిట్ చిత్రాల్లో ఆయన తన నటనతో మెప్పించారు. 2004లో విడుదలైన "వెల్కమ్ టు మూస్‌పోర్ట్" చిత్రం ఆయన చివరి సినిమా.
వివరాలు
ఇతర రంగాల్లో ఆసక్తి
సినిమాలకన్నా ముందు ఆర్మీలో నాలుగున్నర ఏళ్లు సేవలు అందించారు.
అనంతరం న్యూయార్క్‌లో కొంతకాలం గడిపి, తుదకు తన కెరీర్‌ను పూర్తిగా నటన వైపు మళ్లించారు.
హ్యాక్‌మాన్ మృతితో హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.