LOADING...
Taapsee: విమర్శల తర్వాత యూటర్న్‌.. తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసల వర్షం
విమర్శల తర్వాత యూటర్న్‌.. తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసల వర్షం

Taapsee: విమర్శల తర్వాత యూటర్న్‌.. తెలుగు సినిమాపై తాప్సీ ప్రశంసల వర్షం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి తాప్సీ పన్ను ఇటీవల సౌత్‌ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. సౌత్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన ఆమె, తన తొలి సినిమా అనుభవాలను పంచుకుంటూ కొన్ని ఆరోపణలు చేశారు. గ్లామర్‌ సన్నివేశాలు, పాటల చిత్రీకరణలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలనే ఉద్దేశంతో ప్యాడెడ్‌ బ్రా ధరించాలని సౌత్‌ ఫిల్మ్‌మేకర్లు తనపై ఒత్తిడి తెచ్చేవారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాప్సీ టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఎక్కువగా లభిస్తాయని తెలిపారు.

Details

తెలుగు ప్రేక్షకులకు అంటే నాకు అభిమానం

తమిళంతో పోలిస్తే అలాంటి అవకాశాలు అక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పారు. టాలీవుడ్‌ తనకు అందించినన్ని మంచి పాత్రలు తమిళ సినిమా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు మంచి అభిమానముందని, ఇక్కడి అవకాశాలు తన విలువను పెంచాయని చెప్పారు. తన కెరీర్‌ ఎదుగుదలకు అవి ఎంతో దోహదపడ్డాయని వెల్లడించారు. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన తాప్సీ, గతంలో సౌత్‌లో నటించినప్పటికీ తనకు తగిన గుర్తింపు రాలేదని పలుమార్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆమె హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చిత్రం ఝుమ్మంది నాదం. టాలీవుడ్‌లో ఆమె చివరిసారిగా మిషన్ ఇంపాజిబుల్ (2022). చిత్రంలో కనిపించింది.

Advertisement