
ఉగ్రం ట్విట్టర్ రివ్యూ: అల్లరి నరేష్ కొత్త అవతారం ప్రేక్షకులను ఆకట్టుకుందా?
ఈ వార్తాకథనం ఏంటి
నాంది కాంబినేషన్లో వచ్చిన ఉగ్రం సినిమా, ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ను కొత్త అవతారంలో చూపించాడు దర్శకుడు విజయ్ కనకమేడల.
ఉగ్రం సినిమా యూఎస్ ప్రీమియర్లు నిన్న రాత్రి నుండి ప్రదర్శితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
సినిమాలోని ప్లస్ పాయింట్లు
మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఉగ్రం సినిమా, ఆద్యంతం ఆకట్టుకుందని అంటున్నారు. అల్లరి నరేష్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని ప్రశంసిస్తున్నారు.
సెకండాఫ్ చాలా ఆసక్తిగా సాగిందనీ, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు అబ్బురపరిచాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా హిజ్రా ఫైట్, ఇంకా క్లైమాక్స్ ఫైట్స్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
Details
అల్లరి నరేష్ నటనపై పొగడ్తలు
సినిమాలోని మైనస్ పాయింట్లు
స్టోరీ లైన్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని సీన్లలో సాగదీత కనిపించిందని, అలాగే లవ్ ట్రాక్ సరిగ్గా పండలేదని అన్నారు.
కథా పరంగా మంచి మంచి సీన్లు ఉన్నప్పటికీ వాటికి కమర్షియల్ హంగులు తీసుకురావడం వల్ల కొంత ఇబ్బంది అయినట్లుగా చెబుతున్నారు.
అనుకోకుండా వచ్చే పాటలు సినిమా చూసే వాళ్ళకు చికాకు తెప్పిస్తాయని, పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేదని ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
అల్లరి నరేష్ మాత్రం యాక్టింగ్ లో ఇరగదీసాడనీ, ఎక్కడా కూడా వంక పెట్టే అవకాశం లేదని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
షైన్ స్క్రీన్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మిర్ణా మీనన్ హీరోయిన్ గా నటించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉగ్రం ట్విట్టర్ రివ్యూ
#Ugram is pure goosebumps stuff. what a perfomence anna @allarinaresh 🔥🔥🔥.
— praveen Chowdary kasindala (@PKasindala) May 4, 2023
Second half 🔥🔥🔥
Fights especially climax and hizra flight 🔥🔥🔥
Cinematography 🔥🔥🔥
Bgm,🔥🔥@sahugarapati7 good production.
Overall: 3.5/5
Perfect mystery drama
Ugram is 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/lAovtf3tf1
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఉగ్రం ట్విట్టర్ రివ్యూ
#Ugram movie review -
— movie_2updates (@Movie_updates2) May 4, 2023
POSITIVES:
1)@allarinaresh acting 👌👌
2) BGM 🥵🥵
3) intermission (rain fight)👍👍
4)climax🥵🥵🔥
Negatives:
1)so many drag scenes
2) love track
Overall only for allari naresh performance
Rating-2.5/5
Average movie pic.twitter.com/okE13flcMZ