
Siddu Jonnalagadda : ఆ సినిమాలా కాకుండా 'జాక్' సినిమాని ఇప్పుడే హిట్ చేయండి
ఈ వార్తాకథనం ఏంటి
టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం 'జాక్'. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు.
తాజాగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం పాల్గొంది.
టిల్లు స్క్వేర్ తర్వాత నేను చేయాల్సిన సినిమాపై కొంత గందరగోళంలో ఉన్నానని, మళ్లీ అదే తరహాలోనో లేదా కాస్త భిన్నంగా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో నిర్మాత ప్రసాద్ డైరెక్టర్ భాస్కర్‌ను నాతో కలిపారని పేర్కొన్నారు.
ఆయన చెప్పిన కథ విన్న వెంటనే ఇది నాకే కాదని, ఆడియెన్స్‌కి కూడా కొత్త అనిపిస్తుందని ఫీలయ్యాని తెలిపారు.
Details
ఏప్రిల్ 10న రిలీజ్
టిల్లు తరహాలో చేయకుండా, కొత్త పంథాలోకి వెళ్లాలని అనిపించిన సినిమా ఇదేనని పేర్కొన్నారు.
భాస్కర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆరెంజ్ సినిమా సమయంలో ఆయన నన్ను తిట్టేవాడని, అయితే జాక్‌లో కూడా నాకు మంచి స్పేస్ ఇచ్చారని సిద్ధూ చెప్పారు.
ఈ మూవీలో వినోదం, పంచ్‌లు అన్నీ ఉంటాయని, బేబి సినిమా చూసినప్పుడే వైష్ణవి హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యామని, ఆమెలో చాలా టాలెంట్ ఉందన్నారు.
జాక్ సినిమా ఏప్రిల్ 10న విడుదలవుతుందన్నారు. ఆరెంజ్‌ను పదేళ్ల తర్వాత గుర్తుచేసుకున్నట్లుగా కాకుండా, ఇప్పుడే చూసి హిట్ చేయాలని సిద్ధూ చెప్పుకొచ్చారు.
ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. టిల్లు తరహాలోనే మరో హిట్ కొడతాడా అనే ఆసక్తితో అభిమానులు వేచి చూస్తున్నారు.