Page Loader
Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వెంకీ మామ, అనిల్ రావిపూడి.. 
అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వెంకీ మామ, అనిల్ రావిపూడి..

Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్ 4లో వెంకీ మామ, అనిల్ రావిపూడి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2024
02:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్‌స్టాపబుల్ సీజన్ 4 విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో సూర్య పాల్గొని సందడి చేశారు. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హాజరై బాలయ్యతో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బన్నీ ఎపిసోడ్ భారీ వ్యూస్ సాధించి రికార్డులను తిరగరాసింది. ఇక తాజా ఎపిసోడ్‌లో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల సెట్స్‌పై తమ నవ్వుల తుఫానుతో అందరినీ ఆకట్టుకున్నారు.

వివరాలు 

'సంక్రాంతికి వస్తున్నాం'ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ కి వెంకటేష్

ఇక వచ్చే ఎపిసోడ్‌లో మరో ప్రముఖ హీరో పాల్గొనబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆ స్టార్ ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ అన్‌స్టాపబుల్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. వెంకటేష్‌తో పాటు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్‌లో పాల్గొని, సినిమా విశేషాలను బాలయ్యతో పంచుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌ను ఈ నెల 22న షూట్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. చాలా కాలం తర్వాత బాలయ్య - వెంకటేష్ ఒకే వేదికపై కలుసుకోవడం జరుగుతుండటంతో, ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్‌కి, ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.