Page Loader
Unstoppable with NBK : మూడో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి అతిథులు ఎవరో తెలుసా
వచ్చే అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి అతిథులు ఎవరో తెలుసా

Unstoppable with NBK : మూడో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి అతిథులు ఎవరో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 14, 2023
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్‌స్టాపబుల్ మూడో ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓటిటి రంగంలో సరికొత్త రికార్డులని సృష్టించిన అన్‌స్టాపబుల్ విత్ NBK మొదటి ఎపిసోడ్‌లో భగవంత్ కేసరి టీం కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. రెండో ఎపిసోడ్'లో 'యానిమల్' బృందం రణ్ బీర్ కపూర్,రష్మిక మందన్న, సందీప్ వంగ వచ్చేశారు. ఇక మూడో ఎపిసోడ్ రిలీజ్'కి రెడీ అయ్యింది. ఎపిసోడ్ షూటింగ్ సైతం పూర్తి చేసుకుంది.అయితే ఈ మూడో ఎపిసోడ్'లో అతిథులు ఎవరంటే, ఒకప్పుడు బాలయ్యతో కలిసి పని చేసిన సెలబ్రిటీస్. మంగమ్మగారి మనవడు సినిమాలో బాలయ్యకి జోడిగా నటించిన సుహాసిని, మరోసారి 'దంచవె మెనత్తా కూతురా' రోజులను గుర్తు చేసేందుకు అన్‌స్టాపబుల్'లో సందడి చేయనున్నారు.

DETAILS

మూడో ఎపిసోడ్'లో మెరవనున్న శ్రియా శరణ్,సుహాసిని

చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్యతో జంటగా మెరిసిన శ్రియా శరణ్ మూడో ఎపిసోడ్'లో అతిథిగా రానున్నారు. అందాల తారలు సహా టాలీవుడ్ దర్శకులు సైతం ఈ కొత్త ఎపిసోడ్'లో భాగం కానున్నారు. బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, అల్లరి పిడుగు హిట్ సినిమాలు తెరకెక్కించిన జయంత్ సి.పరాన్జీ సైతం అతిథిగా రానున్నారు. ప్రస్తుతం మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ షోకి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే అతిథులను పరిచయం చేస్తూ ఓ చిన్న వీడియోని రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

మూడో అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కి అతిథులు వీరే