Page Loader
Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్
అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్

Allu Arjun Fan: అల్లు అర్జున్‌ను కలిసేందుకు 1,600 కిలోమీటర్లు సైకిల్‌పై వచ్చిన యూపీ ఫ్యాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2024
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నారు. 2021లో విడుదలైన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అయింది. అల్లు అర్జున్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మేనరిజమ్స్‌, మాస్ యాక్షన్, స్టైల్, డ్యాన్స్‌కు ఉత్తరాదిలోనూ బాలీవుడ్‌ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఒక అభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై ఏకంగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలీగఢ్‌లోని ఓ అభిమాని, తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై 1,600 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌ వచ్చాడు. ఇవాళ ఈ అభిమాని అల్లు అర్జున్‌ను కలుసుకుని తన కలను నెరవేర్చుకున్నాడు.

Details

డిసెంబర్ 5న పుష్ప  2 రిలీజ్

తన అభిమాన నటుడిని కలిసి ఎమోషనల్‌గా స్పందించిన ఆ ఫ్యాన్, సైకిల్‌ ప్రయాణం గురించి వివరాలు చెప్పాడు. తన కోసం వచ్చిన అభిమానిని ఆలింగనం చేసి పలకరించిన అల్లు అర్జున్‌, అతని ప్రయాణం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సైకిల్‌పై 1,600 కిలోమీటర్లు వచ్చాడని తెలిసిన తర్వాత అల్లు అర్జున్ ఆ ఫ్యాన్‌కు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ట్రైన్‌ లేదా ఫ్లైట్‌ ద్వారా సురక్షితంగా తిరిగి పంపించేందుకు ఆదేశాలు ఇచ్చారు. అభిమాని ప్రదర్శించిన అంకితభావానికి ముగ్ధుడైన అల్లు అర్జున్, పుష్ప 2 ప్రమోషన్ల కోసం ఉత్తరప్రదేశ్ వస్తే మళ్లీ కలుస్తానని హామీ ఇచ్చారు. చివర్లో "జుకేగా నై" (తగ్గేదే లే) అంటూ పుష్ప డైలాగ్‌తో ఆ అభిమానికి మరింత ఆనందం కలిగించారు.