Page Loader
Dr. Prathap C Reddy: తాత బయోపిక్‌ని తీయనున్న ఉపాసన .."ది అపోలో స్టోరీ" బుక్ లాంచ్ 
తాత బయోపిక్‌ని తీయనున్న ఉపాసన .."ది అపోలో స్టోరీ" బుక్ లాంచ్

Dr. Prathap C Reddy: తాత బయోపిక్‌ని తీయనున్న ఉపాసన .."ది అపోలో స్టోరీ" బుక్ లాంచ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉపాసన కామినేని కొణిదెల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 91వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అమర్ చిత్ర కథ సహకారంతో ఉపాసన కామినేని కొణిదెల "ది అపోలో స్టోరీ" అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. "ది అపోలో స్టోరీ" లో ప్రతాప్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లు.. ఇలా అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉంటాయి. సోమవారం ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని చెన్నై అపోలో హాస్పిటల్ లో ఈ పుస్తకాన్ని లాంచ్ చేశారు.

Details 

భవిష్యత్తులో ప్రతాప్ రెడ్డి బయోపిక్ 

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రతాప్ రెడ్డి గురించి,అపోలో గురించి, తన తాతయ్య తన కూతుళ్లలో ఎలా స్ఫూర్తి నింపారో వివరించారు. ఈ బుక్ ను ప్రతి తండ్రి చదవాలని,ఈ బుక్ చదివి ప్రతి మహిళ స్ఫూర్తి పొందాలని అన్నారు. తన తాతగారి బయోపిక్‌ను నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగినప్పుడు, భవిష్యత్తులో అది జరగవచ్చని ఆమె చెప్పింది. తన భర్త రామ్ చరణ్సినిమాలో నటిస్తాడా అని అడగ్గా అది దర్శకుడి విజన్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీంతో ఉపాసన తాతయ్య, అపోలో ఫౌండర్ డా. ప్రతాప్ చంద్ర రెడ్డి బయోపిక్ కూడా భవిష్యత్తులో రాబోతుందని తెలుస్తోంది.