Page Loader
upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..
ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..

upcoming telugu movies: ఈవారం థియేటర్, ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓ వైపు దీపావళి సందడి కొనసాగుతుండగా, ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే, కొన్ని ప్రాజెక్టులు ఓటిటి వేదికపై వినోదాన్ని పంచేందుకు రెడీగా ఉన్నాయి. ఆ చిత్రాలు ఏవో చూసేద్దాం!

వివరాలు 

ప్రేమ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'ధూం ధాం' 

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'ధూం ధాం'. ఇందులో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సాయి కిశోర్ మచ్చ ముద్రతో రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వివరాలు 

నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్‌: 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' 

'స్వామిరారా', 'కేశవ' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత నిఖిల్‌, సుధీర్‌ వర్మ కలిసి తెరక్కించిన మరో సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. బి.బాపినీడు సమర్పణలో, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ కథానాయికగా నటిస్తుండగా, దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించారు. ప్రేమ కథకు యాక్షన్‌ మేళవింపుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.

వివరాలు 

యధార్థ సంఘటనల ఆధారంగా 'జితేందర్‌రెడ్డి' 

'ఉయ్యాల జంపాల'తో యువతను ఆకట్టుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ డ్రామా 'జితేందర్‌రెడ్డి'. బాహుబలి ఫేం రాకేశ్‌వర్రే కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం,1980ల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించారు. నవంబరు 8న విడుదల కానున్న ఈ సినిమా,రాజకీయ నేపథ్యంలోని యథార్థ సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర బృందం ఆశిస్తోంది. తమిళంలో సూపర్‌హిట్ 'బ్లడీ బెగ్గర్‌' తెలుగులో.. తమిళంలో మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రం'బ్లడీ బెగ్గర్‌' ఇప్పుడు తెలుగులో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కవిన్‌ ప్రధాన పాత్రలో శివ బాలన్ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ నిర్మించారు. నవంబర్‌ 7న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం,ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందనే విశ్వాసం ఉంది.

వివరాలు 

'జాతర'గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ డ్రామా 

సతీష్‌బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జాతర'. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 8న విడుదల కానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో జాతర నేపథ్యంలో నడిచే కథాంశమని, ఇందులో విజువల్స్‌, యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్ర బృందం తెలిపింది. మరో నాలుగు సినిమాలు ప్రేమ, యాక్షన్‌ మేళవింపుతో కూడిన ఇతర చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో 'ఈ సారైనా?', 'రహస్యం ఇదం జగత్‌', 'వంచన', 'జ్యూయల్‌ థీఫ్‌' చిత్రాలు ఉన్నాయి.

వివరాలు 

ఓటీటీ ప్రాజెక్టులు.. 

నెట్‌ ఫ్లిక్స్‌: మీట్‌ మీ నెక్ట్స్‌ క్రిస్మస్‌ (హలీవుడ్‌) నవంబరు 6 అవుటర్‌ బ్యాంక్స్‌ 4 (వెబ్‌సిరీస్‌) నవంబరు 7 మిస్టర్‌ ప్లాంక్‌టన్‌ (కొరియన్‌) నవంబరు 8 ది బకింగ్‌ హామ్‌ మర్డర్స్‌ (హిందీ) నవంబరు 8 ఉమ్జోలో (హాలీవుడ్‌) నవంబరు 8 వేట్టయాన్‌ (తెలుగు) నవంబరు 8 విజయ్‌ 69 (హిందీ) నవంబరు 8 ఆర్కేన్‌ 2 (యానిమేషన్‌) నవంబరు 9 ఇట్స్‌ఎండ్‌ విత్‌ అజ్‌ (హాలీవుడ్‌) నవంబరు 9 అమెజాన్‌ ప్రైమ్‌: సిటాడెల్‌: హనీ బన్నీ (హిందీ సిరీస్‌) నవంబరు 7 కౌంట్‌డౌన్‌: పాల్‌ వర్సెస్‌ టైసన్‌వెబ్‌సిరీస్‌ నవంబరు 7 ఇన్వెస్టిగేషన్‌ ఏలియన్‌ (వెబ్‌సిరీస్‌)నవంబరు 8

వివరాలు 

ఓటీటీ ప్రాజెక్టులు.. 

జియో సినిమా: డిస్పికబుల్‌ మీ 4 (తెలుగు) నవంబరు 5 డిస్నీ+హాట్‌స్టార్‌: ఎక్స్‌ప్లోరర్‌ : ఎండ్యూరన్స్‌ (హలీవుడ్‌) నవంబరు 3 అజయంతే రందం మోషనమ్‌ (ARM) (మలయాళం) నవంబరు 8 ఆహా: జనక అయితే గనక (తెలుగు) నవంబరు 8 బుక్‌ మై షో: ట్రాన్స్‌ఫార్మర్స్‌ వన్‌ (యానిమేషన్‌)నవంబరు 6