Loading...
Upcoming Movies: చరిత్రకు వెండితెర రూపం.. దేశభక్తి కథలతో వస్తున్న సినిమాలివే!
చరిత్రకు వెండితెర రూపం.. దేశభక్తి కథలతో వస్తున్న సినిమాలివే!

Upcoming Movies: చరిత్రకు వెండితెర రూపం.. దేశభక్తి కథలతో వస్తున్న సినిమాలివే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశభక్తిని చాటిచెప్పే కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి ఆదరణే ఉంటుంది. భారత చరిత్రలోని కీలక ఘట్టాలు, వీరుల పోరాటాలు, దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల కథలతో పాటు ఉత్కంఠ రేపే స్పై థ్రిల్లర్‌లకు కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో చరిత్ర, దేశభక్తి, యుద్ధం వంటి అంశాలను ఆధారంగా చేసుకుని పలు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో ఆసక్తి రేపుతున్న కొన్ని చిత్రాల వివరాలివి.

వివరాలు

ఫౌజీ..

భారత స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రను ప్రధానంగా చూపించే చిత్రమే 'ఫౌజీ'.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు.

అయితే ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న బయోపిక్ కాదు.

స్వాతంత్య్రం కోసం పోరాడిన సైనికుల త్యాగాలు, వారి పోరాటాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా.. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివరాలు

రణబాలి..

చరిత్రలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న మరో పాన్ ఇండియా చిత్రం 'రణబాలి'.

1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన సంఘటనలను కథకు ఆధారంగా తీసుకున్నారు.

ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఇందులో టైటిల్ పాత్రలో కనిపించనుండగా.. రష్మిక జయమ్మగా అలరించనున్నారు.

హాలీవుడ్ చిత్రం 'ది మమ్మీ'తో గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లో ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా విడుదలకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. త్వరలోనే 'రణబాలి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT

వివరాలు

మాతృభూమి: మే ది వార్ రెస్ట్ ఇన్ పీస్

2020 జూన్‌లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'మాతృభూమి: మే ది వార్ రెస్ట్ ఇన్ పీస్'.

ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

చిత్రాంగద సింగ్ కథానాయికగా కనిపించనుండగా.. అపూర్వ లఖియా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

గల్వాన్ ఘటనకు సంబంధించిన నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడింది.

ADVERTISEMENT

వివరాలు

భరత వర్ష..

చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం 'భరత వర్ష'.

ఇది హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోంది. క్రీ.శ. 642లో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.

ఓ గొప్ప యోధుడి జీవితాన్ని, అతడి పోరాటాన్ని ప్రధానంగా తీసుకుని ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇందులో గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక పాత్రలో కనిపించనున్నారు.

చారిత్రక అంశాలు, యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ADVERTISEMENT