వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్
విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ సినిమాను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. హిట్ చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని గ్లింప్స్ ద్వారా అర్థమయ్యింది. అదీగాక వెంకటేష్ ను సరికొత్త అవతారంలో చూడబోతున్నామని తెలిసింది. అయితే గత కొన్ని రోజులుగా సైంధవ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అసలు షూటింగ్ జరుగుతుందో లేదో కూడా తెలియలేదు. ప్రస్తుతం ఈ విషయమై ఒక వార్త బయటకు వచ్చింది.
శ్రద్ధా శ్రీనాథ్ వెల్లడించిన విషయాలు
సైంధవ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైంధవ్ సినిమా షూటింగ్ విషయమై తన ఇన్స్టా స్టోరీ లో ఒక పోస్ట్ చేసిన శ్రద్ధ, సైంధవ్ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాదులో కంప్లీట్ అయిందని తెలియజేసింది. దీంతో మూడో షెడ్యూల్ కు చిత్ర బృందం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. నీహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.