Page Loader
ఒకే సినిమాలో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్
త్రిమూర్తులు సినిమాలో నటించిన టాప్ హీరోస్

ఒకే సినిమాలో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Jun 01, 2023
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి ఓ చిత్రంలో నటించారన్న సంగతి ఎంతమందికి తెలుసు. ఇలాంటి ఓ అరుదైన సంఘటనను నేటి సినీ ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. కానీ అప్పట్లోనే వీరి కాంబినేషన్ లో ఓ మూవీ రానే వచ్చింది. ఈ నలుగురు స్టార్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారం, 10 రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద పెద్ద పండగ వాతావరణం. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ టాప్ హీరోలుగా ఓ వెలుగు వెలిగారు. నిజ జీవితంలోనూ వీరి కోసం పడిచచ్చేంత అభిమానాన్ని సైతం సొంతం చేసుకున్నారు.

Details

ఒకే పాటలో నలుగురు అగ్రహీరోలు... ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

చిరు, బాలయ్య, నాగ్, వెంకీలు కలిసి నటించిన సినిమా త్రిమూర్తులు. అయితే వాస్తవానికి ఈ సినిమాలో హీరోగా నటించింది వెంకటేష్ మాత్రమే. కానీ ఓ పాటలో వీరంతా అతిథులుగా సందడి చేశారు. ఈ చిత్రంలో అలనాటి సోగ్గాడు దివంగత ఫ్యామిలీ హీరో శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయశాంతి, భానుప్రియ సైతం ఈ పాటలో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది