అటు ఓజీలో పాట, ఇటు ఉస్తాద్ లో యాక్షన్: పవన్ కళ్యాణ్ డబల్ ధమాకా
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న సినిమాల షూటింగుల్లో పాల్గొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇటు ఓజీ, అటు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
అయితే ఈ రెండు సినిమాల నుండి క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. ముంబైలో జరుగుతున్న ఓజీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం పుణెలో మరో షెడ్యూలు మొదలు కాబోతుందని చిత్రబృందం తెలియజేసింది.
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్, ప్రియాంకా మోహన్ ల మధ్య డ్యుయట్ సాంగ్ ఉంటుందని అంటున్నారు. సాంగ్ పూర్తికాగానే కొన్నిరోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఓజీ షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్.
Details
యాక్షన్ సీన్లను తెరకెక్కించే పనిలో హరీష్ శంకర్
ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్లను తెరకెక్కించనున్నారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసిన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు హరీష్ శంకర్, కెమెరామెన్ అయానక బోస్ కలిసి చర్చిస్తున్న ఫోటోలను పంచుకుంది.
ఓజీ సినిమాను సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ధమాకా భామ శ్రీలీల, హీరోయిన్ గా నటిస్తుంది.