LOADING...
Upendra: సైబర్‌ మోసగాళ్ల బారిన ఉపేంద్ర దంపతులు.. ఫోన్ల హ్యాక్‌పై కీలక హెచ్చరిక
సైబర్‌ మోసగాళ్ల బారిన ఉపేంద్ర దంపతులు.. ఫోన్ల హ్యాక్‌పై కీలక హెచ్చరిక

Upendra: సైబర్‌ మోసగాళ్ల బారిన ఉపేంద్ర దంపతులు.. ఫోన్ల హ్యాక్‌పై కీలక హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2025
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్‌ నేరాలు రోజురోజుకీ ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే కాదు, ప్రముఖులు కూడా ఈ మోసాలకు బలవుతున్నారు. తాజాగా కన్నడ సినీ నటుడు ఉపేంద్ర దంపతులు సైబర్‌ కేటుగాళ్ల టార్గెట్‌గా మారారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర వెల్లడించారు. సోమవారం ఉదయం తన భార్య ప్రియాంక ఆర్డర్‌ చేసిన వస్తువుకు సంబంధించి ఒకరు ఫోన్‌ చేసినట్లు తెలిపారు. డెలివరీ కోసం కొన్ని హ్యాష్‌ట్యాగ్స్‌, నంబర్లు ఎంటర్‌ చేయాలని చెప్పగా, ఆ తర్వాత ప్రియాంక ఫోన్‌ హ్యాక్‌ అయిందని తెలిపారు.

Details

పోలీసులకు ఫిర్యాదు

అంతేకాదు తర్వాత తన ఫోన్‌ కూడా హ్యాక్‌ అయ్యిందని ఉపేంద్ర చెప్పారు. తమ ఫోన్‌ నంబర్లు, సోషల్‌ మీడియా ఖాతాల నుంచి ఎవరైనా మెసేజ్‌లు పంపితే, ముఖ్యంగా డబ్బు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. తమ నంబర్ల నుంచి కాల్‌ వచ్చినా డబ్బు పంపవద్దని అభిమానులను హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో, సైబర్‌ నేరాల పట్ల అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ఎక్స్‌ వేదికగా ఒక వీడియో ద్వారా ఉపేంద్ర పంచుకున్నారు.