Page Loader
Dadasaheb Phalke : దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'ఉస్తాద్', 'పొలిమేర 2' .. ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర 
దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'ఉస్తాద్', 'పొలిమేర 2'

Dadasaheb Phalke : దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'ఉస్తాద్', 'పొలిమేర 2' .. ఉత్తమ నటుడిగా నవీన్‌ చంద్ర 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2024
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ,టప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి పొలిమేర'. ఈ చిత్రం నేరుగా డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలై మంచి వ్యూస్ దక్కించుకున్న ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'పొలిమేర 2' తెరకెక్కిన విషయం తెలిసిందే. గతేడాది నవంబరులో థియేటర్లలో రిలీజై, ప్రేక్షకులను థ్రిల్‌ చేసింది. తాజాగా, ఈ సినిమా ప్రతిష్ఠాత్మక 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌' అవార్డును సొంతం చేసుకుంది. మరోవైపు ,శ్రీ సింహ నటించిన 'ఉస్తాద్'కు "ఆనరరీ జ్యూరీ మెన్షన్‌' పురస్కారం లభించింది. ఈ రెండు చిత్రాలూ తమ విలక్షణమైన కథలు, నటనకు గాను ప్రశంసలు అందుకున్నాయి.

Details 

ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న నవీన్ చంద్ర

చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ''ప్రేమతో మేం తెరకెక్కించిన ఈ సినిమాకి అవార్డు వచ్చింది. దీనికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు'' అంటూ పేర్కొంది. భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే జయంతి సందర్భంగా దిల్లీలో 14వ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను మంగళవారం నిర్వహించారు. అంతేకాకుండా ఈ ఉత్సవంలో 'మంత్ ఆఫ్ మధు' కథానాయకుడు నవీన్ చంద్ర కూడా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా 2023 అక్టోబరులో థియేటర్లలో విడుదలైంది. ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.