LOADING...
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర హక్కులపై ఉత్కంఠ.. రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు
రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర హక్కులపై ఉత్కంఠ.. రూ.70 కోట్లు డిమాండ్ చేస్తున్న నిర్మాతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ వ్యాపారం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ హక్కుల విషయమై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య గట్టి స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ హక్కుల కోసం నిర్మాతలు సుమారు రూ.70 కోట్లను కోరుతున్నారని సమాచారం. అయితే, కొనుగోలుదారులు మాత్రం గరిష్టంగా రూ.60 కోట్ల వరకే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదివరకు పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని అందుకోవడంతో, తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు 

మొత్తం మీద రూ.155 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంచనా

ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థ Mythri Movie Makers ఈ స్థాయిలో ధరను నిర్ణయించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత సినీ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా మొత్తం థియేట్రికల్ వ్యాపారం అన్ని ప్రాంతాలు కలిపి సుమారు రూ.155 కోట్లకు సమీపించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడిగా శ్రీలీల, రాశి ఖన్నా నటిస్తున్నారు. సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆంధ్ర ప్రాంత హక్కుల ఒప్పందం కూడా త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement