Page Loader
Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!
'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!

Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ధమాకా' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన శ్రీలీల, ఆ తర్వాత వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ తన సీన్‌లో ఉన్న హీరోయిన్లకు గట్టి పోటీగా నిలిచింది. అయితే అప్పుడే కెరీర్ పీక్స్‌లో ఉందనుకునే సమయంలో కొన్ని ఫ్లాపులు ఆమె ఇమేజ్‌ను కొద్దిగా దెబ్బతీశాయి. ఇదే సమయంలో శ్రీలీల సైన్ చేసిన ప్రాజెక్టు 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో 'గబ్బర్ సింగ్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

Details

జూన్ లో నూతన షెడ్యూల్

అయితే పవన్ రాజకీయ ప్రస్థానం కారణంగా ఈ ప్రాజెక్ట్ నిరంతరంగా వాయిదాలు పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం తిరిగి సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. జూన్‌లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం శ్రీలీల ముందే బల్క్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం. ఇప్పటికే కమిట్‌మెంట్ ఇచ్చిన కారణంగా ఆమె ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌కి షిఫ్ట్ అవుతుంది. జూన్ 10 నుండి శ్రీలీల ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననుందని టాక్ వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ ప్రాజెక్టుల విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.