Ustad Bhagat Singh: మార్చిలోనే థియేటర్లలోకి ఉస్తాద్ భగత్ సింగ్? పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
ఈ వార్తాకథనం ఏంటి
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరిగింది. అయితే తాజాగా వస్తున్న టాక్ ప్రకారం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల మరింత ముందుకు వచ్చే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా మార్చి నెలలోనే థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
నిజానికి మార్చి 27న రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కారణంగా ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దీంతో అదే తేదీకి 'ఉస్తాద్ భగత్ సింగ్'ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగే అని చెప్పారు. గబ్బర్ సింగ్ హిట్ కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Details
హీరోయిన్లగా రాశి ఖన్నా, శ్రీలీల
'ఓజీ' తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది దేవిశ్రీ ప్రసాద్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన లభించగా, త్వరలోనే సెకండ్ సాంగ్‌తో పాటు మరిన్ని అప్డేట్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇంతటి అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ కళ్యాణ్‌కు మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాల్సిందే.