LOADING...
vaazha 2 Review : 'వాలా2' రివ్యూ.. మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్టా? ఫట్టా?
'వాలా2' రివ్యూ.. మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్టా? ఫట్టా?

vaazha 2 Review : 'వాలా2' రివ్యూ.. మలయాళ బ్లాక్‌బస్టర్ హిట్టా? ఫట్టా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 24, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

తక్కువ బడ్జెట్‌తో, పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్న మలయాళ సినిమా 'వాలా2. బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్' ట్యాగ్‌తో రిలీజ్ అయ్యింది. ఏప్రిల్ మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఇది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే 'వాలా' ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను మెప్పించగా, ఇప్పుడు థియేటర్లలో వచ్చిన 'వాలా2' ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని అందించింది అనే ఆసక్తి నెలకొంది.

వివరాలు

కథ ఏమిటంటే..

హాషిర్, అలన్, అజిన్, వినాయక్ అనే నలుగురు యువకుల చుట్టూ కథ తిరుగుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ నలుగురిని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కళాశాలకు పంపిస్తారు. అయితే వీళ్లు చదువులో కంటే గొడవల్లోనే ఎక్కువగా ముందుంటారు. వారి ప్రవర్తన కారణంగా ఒక దశలో కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యే పరిస్థితి వస్తుంది. అయితే ఒక పోలీస్ అధికారి (ఆల్ఫోన్స్ పుత్రన్ పాత్ర) జోక్యం చేసుకుని వారిని రక్షిస్తాడు. ఆ తరువాత పరీక్షలు రాసే అవకాశం వారికి లభిస్తుంది. ఉన్నత చదువులు, ఉపాధి కోసం యూకే వెళ్లాలనే వారి కల నెరవేరిందా లేదా? కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత వారి జీవితాలు ఎలా మారాయి అనేదే మిగతా కథ.

వివరాలు

సినిమా ఎలా ఉందంటే..

కేరళలో సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన యువకులనే ప్రధాన పాత్రల్లో తీసుకుని, వారి అసలు పేర్లతోనే చూపిస్తూ రూపొందించిన సినిమా ఇది. 2024లో వచ్చిన 'వాలా' చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందింది. రచయితగా, నిర్మాతలలో ఒకరైన విపిన్ దాస్ మొదటి భాగంలో ఉన్న కథా ఫార్ములానే ఇక్కడ కూడా కొనసాగించారు. చదువుపై దృష్టి పెట్టకుండా తప్పుదారి పడే యువకులు, కళాశాలలో జరిగే గొడవలు, పోలీస్ అధికారి ప్రవేశం, చివర్లో సందేశాత్మక ముగింపు— ఇవి మొదటి సినిమాను గుర్తు చేస్తాయి. అయినప్పటికీ హాస్యానికి ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు.

Advertisement

వివరాలు

ప్రేక్షకులకు హత్తకునే సీన్స్..

ఫార్మాట్ ఒకేలా అనిపించినా, ఈ సినిమాకు ప్రత్యేకత వచ్చేలా కొన్ని కొత్త అంశాలను జోడించారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలని కలలు కనే యువత జీవితాల వెనుక ఉన్న వాస్తవాలను స్పృశిస్తూ, ద్వితీయార్థంలో భావోద్వేగాలను బలంగా చూపించిన తీరు సినిమాకు ప్రత్యేకతను తెస్తుంది. అలాగే తోబుట్టువుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించిన విధానం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది.

Advertisement