LOADING...
Vaazha 2: రూ.200 కోట్లు సాధించిన బ్లాక్‌బస్టర్.. మలయాళ సెన్సేషన్ 'వాలా 2' తెలుగు ట్రైలర్ రిలీజ్

Vaazha 2: రూ.200 కోట్లు సాధించిన బ్లాక్‌బస్టర్.. మలయాళ సెన్సేషన్ 'వాలా 2' తెలుగు ట్రైలర్ రిలీజ్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 21, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక చిన్న చిత్రంగా ప్రారంభమై, కేరళ బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణను పొందిన మలయాళ హిట్ సినిమా 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సావిన్ SA దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యువ నటీనటులు తమ నటనతో మెప్పించారు. సాహు గారపాటి 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళంలో ఇప్పటికే సుమారు రూ.200 కోట్ల స్థూల వసూళ్లు సాధించి, ఈ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతుండగా, 'నేచురల్ స్టార్' నాని ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

వివరాలు

కాలేజ్ నేపథ్యంలో కథ..

మొదటి భాగం ముగిసిన చోటు నుంచే కథను కొనసాగిస్తూ, ఈ సీక్వెల్ ప్రధాన పాత్రల జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను చూపిస్తుంది. కాలేజ్ నేపథ్యంలో సాగే కథలో మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు, కొత్త దశలో వారి ప్రయాణం ప్రధానంగా ఉంటాయి. ట్రైలర్‌ను పరిశీలిస్తే, వినోదం, భావోద్వేగాల సమ్మేళనంతో పాటు, నాస్టాల్జియాను గుర్తు చేసే క్షణాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా 'ప్రేమమ్' సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్ స్పెషల్‌గా అనిపిస్తుంది.

వివరాలు

హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్..

అల్‌ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ చిత్ర ప్రభావం ఇందులో ప్రతిఫలిస్తుంది. హషీర్, అజిన్ జాయ్, వినాయక్, అలన్ బిన్ సిరాజ్ తమ తమ పాత్రల్లో మెప్పించగా, బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి అనుభవజ్ఞులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. మొత్తం మీద ట్రైలర్ చూస్తే యూత్‌ఫుల్ అంశాలు, హృదయానికి తాకే భావోద్వేగాలతో 'వాలా 2' తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Vaazha 2 మూవీ పోస్టర్ రిలీజ్..

Advertisement