
బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, బేబి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు బ్యానర్లో వైష్ణవి చైతన్యకు అవకాశం దక్కిందని తెలుస్తోంది.
రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన ఆశిష్ నటిస్తున్న కొత్త సినిమాలో వైష్ణవి చైతన్య నటించనుందని సమాచారం.
ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో హర్షిత్ రెడ్డి, హన్సితా రెడ్డి నిర్మిస్తున్నారు.
Details
డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య
అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున మల్లిడి సహనిర్మాతగా ఉంటున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించిన పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు.
అంతేకాదు డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మరో సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఫిక్స్ అయిందని సమాచారం. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ అయిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని ఫిలింనగర్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ప్రస్తుతానికి వైష్ణవి చైతన్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరికొన్ని సినిమాలు కూడా ఒప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.