Page Loader
Sandeep Reddy Vanga: 'నా కథను లీక్‌ చేస్తున్నారు': ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌ 
'నా కథను లీక్‌ చేస్తున్నారు': ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌

Sandeep Reddy Vanga: 'నా కథను లీక్‌ చేస్తున్నారు': ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన సందీప్ రెడ్డి వంగా పోస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏ విషయమైనా తన అభిప్రాయాన్ని స్పష్టంగా, నిస్సందేహంగా తెలియజేసే వ్యక్తి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తాజాగా ఆయన పెట్టిన ఒక పోస్టు సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక అగ్ర నటి సంబంధిత పీఆర్‌ బృందం తన కథను లీక్‌ చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ''#DirtyPRGames'' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌) వేదికగా ఆ విషయాన్ని పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ 

వివరాలు 

ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే?

"ఇటీవల నేను ఒక ప్రముఖ నటికి కథ చెప్పాను.ఆమెపై వందశాతం నమ్మకంతో పూర్తివివరాలు తెలియజేశాను. దర్శకులు నటీనటులకు కథ వివరించినప్పుడు అది అనధికారికంగా అయినా 'నాన్‌ డిస్క్లోజర్‌ అగ్రిమెంట్‌' తో సమానంగా భావించాలి. అంటే ఆ కథను బయట ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఆ నిబంధనను ఉల్లంఘించి కథను లీక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం..నేను ఎంతో శ్రమతో రాసుకున్న కథను బయటకు లీక్ చేసేందుకు ప్రయత్నించడం..ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే?దర్శకుడిగా నేను ఓ కథను రూపొందించేందుకు సంవత్సరాల తరబడి శ్రమిస్తాను. నాకు సినిమానే జీవితం.మీరు దీనిని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.కావాలంటే నా కథ మొత్తాన్ని లీక్‌ చేయండి..నాకేం భయం లేదు,"అని సందీప్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

వివరాలు 

ప్రభాస్‌ సరసన త్రిప్తి డిమ్రీ

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. 'యానిమల్‌' సినిమా తర్వాత సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌తో 'స్పిరిట్‌' అనే భారీ బడ్జెట్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌కి చెందిన ఒక అగ్రనటిని తీసుకోనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అనంతరం ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రభాస్‌ సరసన త్రిప్తి డిమ్రీ అనే యువ కథానాయికను ఎంపిక చేసినట్టు సినిమా బృందం అధికారికంగా ప్రకటించింది.

వివరాలు 

ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతున్న #Spirit

ఈ క్రమంలో, సందీప్‌ చేసిన పోస్టులో పేర్కొన్న యువ నటి త్రిప్తి డిమ్రీ అయ్యే అవకాశం ఉందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్రిప్తిని ఎంపిక చేసిన నేపథ్యంలో కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ కథను లీక్‌ చేసినట్టు భావిస్తున్నారు. ఈ కారణంగా #Spirit హ్యాష్ ట్యాగ్‌ ఎక్స్‌లో ట్రెండ్‌ అవుతోంది.