Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ భారీ జీవి ఏంటి జక్కన్న?
ఈ వార్తాకథనం ఏంటి
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎంతటి ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అడ్వెంచరస్ ప్రాజెక్ట్ 'వారణాసి' (#Varanasi) చుట్టూ రోజుకో ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెబుతున్న ఓ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఊహకందని కాన్సెప్ట్‌తో జక్కన్న తెరకెక్కిస్తున్న సరికొత్త విజువల్ వండర్ ఇదేనంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సినిమాల షూటింగ్ సెట్ల నుంచి లీకయ్యే ఫొటోల్లో హీరో లుక్, లొకేషన్ లేదా సెట్‌అప్ కనిపించడం సహజమే.
వివరాలు
సెట్ నుంచి లీకైనట్లు సమాచారం
కానీ 'వారణాసి' సెట్ నుంచి లీకైనట్లు ప్రచారం జరుగుతున్న ఈ పిక్ మాత్రం ఎవరూ కలలో కూడా ఊహించని సరికొత్త సంచలనానికి తెరలేపింది.
పురాతన కళావైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన భారీ ఆలయ నేపథ్యం.. అదే ప్రాంగణంలో కళ్లు చెదిరేంత భారీగా కనిపిస్తున్న ఓ డైనోసార్ ఆకారం.. ఈ వింత కలయిక ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను తలపట్టుకునేలా చేస్తోంది.
దైవత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్ర దేవాలయ సెట్‌లో చరిత్ర పూర్వ యుగానికి చెందిన భయంకరమైన డైనోసార్ ఏం చేస్తోందనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాలు
రోటీన్ ఫార్ములాకు భిన్నంగా మూవీ
రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ రొటీన్ ఫార్ములాకు పూర్తి భిన్నంగా ఉంటాయి.
ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఉందా?
లేక భారతీయ పురాణాల్లోని అంతుచిక్కని రహస్యాలను, డైనోసార్ల కాలం నాటి పరిణామ క్రమాన్ని ముడిపెడుతూ జక్కన్న ఏదైనా సరికొత్త కథను అల్లుతున్నారా? అనే చర్చలు నెటిజన్లలో మొదలయ్యాయి.
ఇండియానా జోన్స్ తరహా గ్లోబల్ అడ్వెంచర్‌గా ప్రచారం అవుతున్న ఈ చిత్రంలో మైథాలజీతో పాటు సైన్స్ ఫిక్షన్‌ను కూడా రాజమౌళి సమపాళ్లలో మిళితం చేస్తున్నారనే ఊహాగానాలకు ఈ లీక్ మరింత బలాన్నిచ్చింది.
వివరాలు
అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు
ఇప్పటికే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ముందు వరుసలో నిలుస్తున్న ఈ సినిమాపై తాజా లీక్‌తో హైప్ పతాక స్థాయికి చేరింది.
హాలీవుడ్ స్థాయి విజువల్స్‌కు అడ్వెంచర్‌ను జోడించడంతో పాటు మన నేటివిటీని తెరపై ఆవిష్కరించడంలో రాజమౌళి స్టైలే వేరని అభిమానులు చెబుతున్నారు.
ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో డైనోసార్ కనిపించే దృశ్యాన్ని వెండితెరపై రాజమౌళి ఎలా ఆవిష్కరించబోతున్నారో ఊహించుకోవడానికే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయంటూ మహేష్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు.
అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోయినా.. ఈ ఒక్క లీక్డ్ పిక్ మాత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మహేష్-జక్కన్న సృష్టించబోయే విధ్వంసానికి ట్రైలర్‌లా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.