
Varun Dhawan: వరుణ్ ధావన్ స్పీడుకు బ్రేక్..! 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌కు బేధియా తర్వాత హిట్ ఫలితం దక్కలేదు.
'బవాల్' ఓటీటీలోనే విడుదల కాగా, ఆ తర్వాత చేసిన సినిమాలు అతనికి విజయాన్ని అందించలేకపోయాయి. 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ', 'ముంజ్యా', 'స్త్రీ 2'లో ప్రత్యేక పాత్రలతో మాత్రమే కనిపించాడు.
ఇక సౌత్ సూపర్‌హిట్ మూవీ 'తేరీ' రీమేక్‌గా వచ్చిన 'బేబీ జాన్' భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో వరుణ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
ప్రస్తుతం 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి', 'హై జవానీ తో ఇష్క్ హోనా హై', 'బోర్డర్ 2 చిత్రాలు చేస్తున్నాడు.
Details
వరుణ్ ధావన్ కెరీర్‌కు మరొక ఆటంకం
ఈ ఏడాది వరుస సినిమాలతో తన కెరీర్‌ను నిలబెట్టుకోవాలని వరుణ్ భావిస్తున్నా అతని వేగానికి బ్రేక్ పడింది.
'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 18న రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 12కి మారింది.
ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్, రొమాంటిక్ కామెడీ జానర్‌లో వస్తోంది. 'బవాల్' తర్వాత జాన్వీ కపూర్‌తో వరుణ్ రెండోసారి జోడీ కడుతున్నాడు.
Details
వాయిదా ఎందుకంటే?
సినిమా విడుదల వాయిదా వెనుక షూటింగ్ పెండింగ్, ఐపీఎల్ ప్రభావం ఉన్నట్లు టాక్. దర్శకుడు శశాంక్ ఖైతాన్ మరింత మెరుగులు దిద్దాలని భావిస్తున్నారట.
ఈ వాయిదా వరుణ్ ధావన్ తదుపరి ప్రాజెక్ట్ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' పై ప్రభావం చూపనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అసలే 'బేబీ జాన్' నిరాశపరిచిన తర్వాత వరుణ్ త్వరగా హిట్ కొట్టాలనుకుంటున్నాడు.
కానీ 'సన్నీ సంస్కారీకి తులసి కుమారి' సెప్టెంబర్ 12కి మారడంతో 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' దసరా టార్గెట్ (అక్టోబర్ 2) కుదరకపోవచ్చని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.