
పెద్ద స్క్రీన్ లో గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ ఈవెంట్: వరుణ్ తేజ్ పెద్దగా ప్లాన్ చేస్తున్నాడుగా
ఈ వార్తాకథనం ఏంటి
గని తర్వాత వరుణ్ తేజ్ నుండి వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున. ఈ మధ్య ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు సమయం ఆసన్నమైంది.
తాజాగా ట్రైలర్ విడుదలపై హీరో వరుణ్ టేజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ కి వెళ్తున్నట్లు వీడియోను పోస్ట్ చేసి ఆగస్టు 10వ తేదీన ట్రైలర్ విడుదల అవుతుందని వెల్లడి చేసాడు.
ట్రైలర్ విడుదల ఈవెంటుని హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో నిర్వహించనున్నారట. మద్యాహ్నం 3గంటల నుండి ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మొదలు కానుంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ పై వరుణ్ తేజ్ పోస్ట్
Strap in, it's about to get awesome!!!#GandeevadhariArjuna
— Varun Tej Konidela (@IAmVarunTej) August 8, 2023
Trailer releasing on AUGUST 10th ,
event at Prasad imax @ 3pm!🔥
@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @shreyasgroup #GDAonAugust25th pic.twitter.com/zDLFELtSVK