Page Loader
MATKA: కొత్త లుక్‌లో మెగా హీరో.. 'మట్కా' నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రీలీజ్
కొత్త లుక్‌లో మెగా హీరో.. 'మట్కా' నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రీలీజ్

MATKA: కొత్త లుక్‌లో మెగా హీరో.. 'మట్కా' నుంచి వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ రీలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2024
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'మట్కా'. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైరా, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్‌ చూస్తుంటే వరుణ్ తేజ్ డాన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Details

'మట్కా  కింగ్' వాసు పాత్రలో వరుణ్ తేజ్

ఈ సినిమాలో 'మట్కా కింగ్' వాసు పాత్రలో వరుణ్ కనిపించనున్నారు. గత కొన్నేళ్లుగా హిట్ అందుకొని వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయినా హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో వేచి చూడాలి. మట్కా చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మూవీ మేకర్స్ ప్రకటించారు