Page Loader
Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..? 
లావణ్యతో లవ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..?

Varun Tej: లావణ్యతో లవ్ సీక్రెట్స్‌ను బయటపెట్టిన వరుణ్ తేజ్.. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరంటే..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 20, 2023
06:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే నిశ్చితార్థ వేడుకను ఘనంగా చేసుకున్నారు. సినిమా స్టేజ్ ఫంక్షన్‌లో తక్కువగా మాట్లాడే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమ వ్యవహారం నడిపాడని మొదట ఎవరూ ఊహించలేదు. జూన్ 9న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసి అందరిని షాక్ కు గురి చేశారు. ఈ నేపథ్యంలో లవ్ సీక్రెట్స్ ను వరుణ్ తేజ్ బయటపెట్టాడు. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ లావణ్యతో ప్రేమ సంగతులపై ఓపెన్ అయ్యారు. ప్రస్తుతం వరుణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇష్టాలన్నీ లావణ్యకు తెలుసు అని, మొదట తానే ప్రపోజ్ చేశానని మెగా వారసుడు వరణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

Details

వరుణ్ తేజ్‌కు ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన లావణ్య

తాను ప్రైవేట్ పర్సన్ కావడతో పర్సనల్ విషయాలు బయట ఎక్కువగా మాట్లాడే వాడిని కాదని, అందుకే లావణ్యతో ప్రేమ విషయాన్ని బయటపెట్టలేదని వరుణ్ వెల్లడించారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో తమ మధ్య లవ్ ఎఫైర్ మొదలైందని, దీనికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని, ప్రస్తుతం తాను వాడుతున్న ఫోన్ ను కూడా లావణ్యనే గిఫ్ట్ గా ఇచ్చిందని తెలిపాడు. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే.