Varun Tej: 'బరి' సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బరి' సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. క్రీడల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌కు సన్నద్ధమవుతున్న సమయంలో వరుణ్ తేజ్ అనుకోని ప్రమాదానికి గురయ్యారు.
వివరాలు
కోలుకుంటున్న హీరో..
ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్న నేపథ్యంలో, వరుణ్ తేజ్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో భాగంగా మంగళవారం ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు ఆయన కాలికి గాయం అయ్యింది. వెంటనే చిత్రబృందం ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించింది. వైద్యుల సలహా మేరకు ఆయనకు చిన్న శస్త్రచికిత్స నిర్వహించగా, అది విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
వివరాలు
ఫ్యాన్స్ ఆందోళన..
గాయం కారణంగా ఆయనకు కొన్ని వారాలపాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో 'బరి' సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 'గెట్ వెల్ సూన్' అంటూ సందేశాలు పంచుకుంటున్నారు.