సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్
విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ ఫ్రాంఛైజీ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సైంధవ్. తాజాగా ఈ చిత్ర టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్ మొదట్లో హ్యాపీగా పాపతో ఆడుకుంటున్న వెంకటేష్ ని చూపించారు. ఆ తర్వాత టీనేజ్ కుర్రాళ్ళ అక్రమ రవాణా గురించి చూపించారు. ఆ తర్వాత యాక్షన్ మోడ్ లో వెంకటేష్ కనిపించారు. ఈ సినిమాలో వెంకటేష్ పాత్రను సైకో అని పిలుస్తారని టీజర్ లో తెలియజేసారు. టీజర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే టీజర్ లో హీరోయిన్లు అయిన రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలను చూపించలేదు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా, 2024 జనవరి 13వ తేదీన రిలీజ్ అవుతుంది.