VenkyAnil3 : విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వస్తున్నాం'
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం "వెంకీఅనిల్03".
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ "సంక్రాంతికి వస్తున్నాం" అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇప్పటికే షూట్ చాలా భాగం పూర్తిచేసిన దర్శకుడు అనిల్ రావిపూడి, రేపటి నుంచి అరకు లోయలో తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
వివరాలు
అరకులోయలో తాజా షెడ్యూ ల్
అరకు లోయలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించి, అనంతరం డెహ్రాడూన్‌లో మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఆ తరువాత ముస్సోరిలో చివరి షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షూట్ పూర్తయిన భాగాలకు డబ్బింగ్ కూడా పూర్తి చేస్తుండగా, నిర్మాత దిల్ రాజు త్వరలోనే ప్రమోషన్లను ప్రారంభించనున్నారు.
సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.
వరుసగా వచ్చిన ఫ్లాప్స్ కారణంగా దిల్ రాజు కోసం ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి అందిస్తున్నారు.