Vennela Kishore: BRS బెదిరింపులకు తట్టుకోలేక ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన వెన్నెల కిషోర్
సోషల్ మీడియాలో వేధింపులు భరించలేక, ట్విట్టర్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు సోషల్ మీడియా యాక్టివిస్ట్,కాంగ్రెస్ సపోర్టర్ వెన్నెల కిషోర్ రెడ్డి ప్రకటించారు. తన పోస్టులు ఎవరినీ నొప్పించకూడదనే ఉద్దేశంతో పెడుతున్నా, బీఆర్ఎస్ పార్టీ నేతలు కక్షతో బెదిరింపులకు దిగుతున్నారని కిషోర్ రెడ్డి అన్నారు. ఒక ప్రఖ్యాత ఎక్స్ ఖాతా నిర్వాహకుడైన అశోక్ రెడ్డి తనను మూడు నెలలుగా వేధిస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరినీ దూషించకుండా పోస్టులు పెడుతున్నప్పటికీ, తనపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు చేయడం అన్యాయమని చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్
"గుడ్ బై టు ట్విట్టర్. ఇవేంటీ బెదిరింపులు? ఇది ఏంటి భాషా? నేను స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, మర్యాదతో ట్వీట్లు చేస్తే కూడా నాపై ఈ రీతిగా వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు చేయడం అన్యాయం. ఇతరులు ముఖ్యమంత్రి గారిపై కురిపించే విమర్శలను మీరు సమర్థిస్తారు కానీ నా పోస్టులకు ఎందుకు కక్ష పెంచుతారు? నాకు చిన్న కుటుంబం ఉంది, ఈ రాజకీయ వేధింపులు అవసరం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు కూడా ఇదే బెదిరింపులు కొనసాగుతున్నాయి," అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కిషోర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.