తదుపరి వార్తా కథనం

Mukul Dev: ప్రముఖ నటుడు కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 24, 2025
11:44 am
ఈ వార్తాకథనం ఏంటి
హిందీ, తెలుగు పంజాబీ చిత్రాల్లో నటించిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకుల్ దేవ్ కన్నుముశారు.
కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ముకుల్.. ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు.
ముకుల్ మృతికి సంబంధించిన విషయాన్ని ఆయన సన్నిహితుడు, నటుడు విందూ దారా సింగ్ తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ముకుల్ దేవ్ తన నటనా ప్రస్థానాన్ని 1996లో 'ముమ్కిన్' అనే టీవీ సీరియల్‌తో ప్రారంభించారు. బాలీవుడ్‌లో 'దస్తక్' (1996) సినిమాతో అడుగుపెట్టారు.
ముకుల్ తెలుగులో కృష్ణ, అదుర్స్ వంటి సినిమాల్లో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.