Page Loader
Rajinikanth: 'వేట్టయాన్‌' ఆడియో ఈవెంట్‌ పాసుల వివాదం.. స్పందించిన రజనీకాంత్ 
'వేట్టయాన్‌' ఆడియో ఈవెంట్‌ పాసుల వివాదం.. స్పందించిన రజనీకాంత్

Rajinikanth: 'వేట్టయాన్‌' ఆడియో ఈవెంట్‌ పాసుల వివాదం.. స్పందించిన రజనీకాంత్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2024
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో టి.జె. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'వేట్టయాన్‌'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో వైభవంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పాస్‌ల ఇష్యూ అభిమానులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పాస్‌ల విక్రయంపై తలెత్తిన సమస్యలపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. ఆడియో విడుదల సందర్భంగా ఎక్స్‌ట్రా పాస్‌లు అమ్మడం వల్ల కొంతమంది అభిమానులకు అసౌకర్యం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రజనీ సూచించారు.

Details

అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా 'వేట్టయాన్‌' విడుదల

ఇక వేట్టయాన్‌ షూటింగ్‌ పూర్తయైందని, ఇక ప్రేక్షకులు తమ ప్రయత్నాన్ని ఎలా స్వీకరిస్తారో వేచి చూడాలన్నారు. అగ్రతారలు, సాంకేతిక నిపుణులు భారీ స్థాయిలో ఈ చిత్రానికి కష్టపడ్డారని, మ్యూజిక్‌ డైరెక్టర్ అనిరుధ్‌ అద్భుతమైన సంగీతం అందించారని చెప్పారు. అదే విధంగా 'మనసిలాయో' పాటకు ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ లభించిందన్నారు. ఈ పాటలో కొరియోగ్రాఫర్ దినేశ్‌ పాత్ర ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.