సైంధవుడిగా మారిన వెంకటేష్.. రెగ్యులర్ షూటింగ్‌లో విక్టరీ
ఈ వార్తాకథనం ఏంటి
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ఉగాది సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే.
సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ లో వెంకటేష్ యాక్షన్ ప్యాక్డ్ గెటప్ లో కనిపించారు. తుపాకీ పట్టుకొని ఫెరోషియస్ గా నడుస్తూ కనిపించారు. వెంకటేష్ కెరీర్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.
సైంధవ్
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైంధవ్
సైంధవ్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుండటంతో ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.
కెమెరామెన్‌గా ఎస్ మణికందన్, ఎడిటర్ గా గ్యారీ బిహెచ్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.
వెంకటేష్ కెరీయర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రం కావడతో ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.