Page Loader
Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రిక.. ఈ రోజున 'శుభ వివాహం' 
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రిక.. ఈ రోజున 'శుభ వివాహం'

Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ ఆహ్వాన పత్రిక.. ఈ రోజున 'శుభ వివాహం' 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2024
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన కాబోయే భార్య వ్యాపారవేత్త బీరెన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12 న వివాహం చేసుకోనున్నారు. దేశంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఇదొకటి అని చెబుతున్నారు. ఇప్పుడు రాధిక-అనంత్ ల వివాహ ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ కార్డ్ ని వెండి,బంగారంతో అలంకరించారు.

వివరాలు 

అనంత్, రాధిక పెళ్లి కార్డు చాలా క్యూట్ గా ఉంది 

వెడ్డింగ్ కార్డ్ ఎరుపు రంగు వార్డ్ రోబ్ ఆకారంలో చక్కగా రూపొందించబడింది. అల్మారా తెరిచిన తర్వాత దాని లోపల వెండి దేవాలయం కనిపిస్తుంది. ఆలయంలో గణపతి, రాధా-కృష్ణ, దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఆలయం పైభాగంలో చిన్న చిన్న గంటలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం నిజమైన వెండితో తయారు చేశారు. అందమైన చెక్కడాలు కూడా ఉన్నాయి. నారాయణుని పేరుతో వెండి అక్షరాలను కూడా చూడచ్చు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కార్డు ఇదే..