హత్య రిలీజ్ డేట్: విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోనీ, బిచ్చగాడు 2 సినిమాతో తెలుగులో మంచి సక్సెస్ అందుకున్నాడు. బిచ్చగాడు మాదిరి బ్లాక్ బస్టర్ కాకపోయినా వసూళ్ళు మాత్రం బాగానే వచ్చాయి. అయితే విజయ్ ఆంటోనీ నుండి మరో కొత్త సినిమా వస్తోంది. ఆయన గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్ లో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో హత్య అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. హత్య ఎలా జరిగిందీ? ఎవరు చేసారు? ఎందుకు చేసారనే విషయాలనే తెలుసుకునే మర్దర్ మిస్టరీగా ఈ సినిమా ఉండబోతుందని టైటిల్ తోనే అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని విజయ్ ఆంటోనీ ప్రకటించాడు.
జులై 21న హత్య రిలీజ్
రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపిస్తున్న హత్య సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళంలో కోలై అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను జులై 21న తెలుగులో విడుదల చేస్తున్నారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిమ్ వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, మురళీ శర్మ, జాన్ విజయ్, సంకిత్ బోహ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరి హత్య సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభవాన్ని మిగుల్చుతుందో చూడాలి.