బిచ్చగాడు 3 సినిమాను కన్ఫర్మ్ చేసిన విజయ్ ఆంటోనీ, వివరాలివే
బిచ్చగాడు సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్ ఆంటోని, తాజాగా బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు తెలుగులో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిచ్చగాడు 2 సినిమాకు సీక్వెల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సర్కిల్స్ లో ఈ వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బిచ్చగాడు 3 సినిమాపై విజయ్ ఆంటోని నోరు విప్పాడు. ఇటీవల ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో మాట్లాడిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు 3 సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 2025 వ సంవత్సరంలో బిచ్చగాడు 3 సినిమా తెరకెక్కుతుందని, దానికి కూడా తనే దర్శకత్వం వహించబోతున్నట్లు వెల్లడి చేశాడు.
బిచ్చగాడు 2 సినిమాకు సంబంధం లేకుండా బిచ్చగాడు 3
బిచ్చగాడు 2 సినిమాలో కనిపించిన కావ్య థాపర్, ఆ తర్వాత తెరకెక్కే సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా కనిపిస్తుందట. అలాగే బిచ్చగాడు సినిమాకి బిచ్చగాడు 2 సినిమాకి సంబంధం ఎలా ఉండదో, అలాగే బిచ్చగాడు 3 సినిమా కూడా విభిన్నంగా ఉంటుందని మాట్లాడాడు. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా, నటుడిగా సినిమాలు చేసిన విజయ్ ఆంటోని, బిచ్చగాడు 2 సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమాను విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించింది. రాధా రవి, వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పేరడీ మొదలగు వారందరూ ప్రధాన పాత్రల్లో నటించారు.