
బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ: విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడా?
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన బిచ్చగాడు 2 చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజవుతోంది.
ఆల్రెడీ అమెరికాలో బిచ్చగాడు 2 ప్రీమియర్స్ పడిపోయాయి. కాబట్టి టాక్ బయటకు వచ్చేసింది. ఇంతకీ సినిమా ఎలా ఉందీ, విజయ్ ఆంటోనీ మరోసారి మ్యాజిక్ చేసాడా లేదా చూద్దాం.
బిచ్చగాడు 2 సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో, ఒకవైపు పేదవాడిగా, మరోవైపు పెద్ద వ్యాపారవేత్తగా విజయ్ ఆంటోనీ కనిపిస్తాడట. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం బాగుందని కామెంట్స్ పెడుతున్నారు.
సినిమా మొత్తంలో అన్నాచెల్లెళ్ళ మధ్య వచ్చే సీన్లు ఆసక్తిగా ఉన్నాయని అంటున్నారు.
Details
తెరపై కనిపిస్తున్న లో బడ్జెట్
యాంటీ బికిలీ ఎపిసోడ్ ఆలోచన బాగుందని చెబుతున్నారు. కాకపోతే బిచ్చగాడు సినిమాలో కనిపించే అమ్మ సెంటిమెంట్ బిచ్చగాడు 2లో లేదని, సినిమా కూడా చాలా నెమ్మదిగా మొదలవుతుందనీ కామెంట్స్ చేస్తున్నారు.
పాటలు సరిగ్గా లేవనీ, నిర్మాణ విలువల్లో లోపాలున్నాయనీ, లో క్వాలిటీలో తీసినట్టుగా తెర మీద కనిపిస్తుందని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు.
కథ పరంగా బాగున్నప్పటికీ సినిమాను తెరమీద తీసుకురావడంలో లోపాలు జరిగాయని అన్నారు. విజయ్ ఆంటోనీ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందని కామెంట్స్ పెడుతున్నారు.
బిచ్చగాడు 2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 6కోట్ల వరకూ బిజినెస్ జరిగిందట. మరి ఆ రేంజ్ కలెక్షన్లను అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాలో దేవ్ గిల్, జాన్ విజయ్, రాధారవి, కీలక పాత్రల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ
#Pichaikkaran2 (Tamil|2023) - THEATRE.
— CK Review (@CKReview1) May 19, 2023
Not a sequel, Standalone film. Apt Title though. Kids gud. Poor VFX. Low production values. Screenplay is dull. No emotional connect. Anti Bikili idea nice, Bad execution. Hardly 1/2 interesting scenes in entire film. Total DISAPPOINTMENT! pic.twitter.com/VMUU06IB30
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిచ్చగాడు 2 సినిమాపై ట్విట్టర్ లో కామెంట్లు
#Pichaikkaran2 starts of really well. Songs ruining the interest. Contrast of the picture is uncomfortable
— Harsha Vardhan (@HarshaV332353) May 19, 2023