తదుపరి వార్తా కథనం

నా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్
వ్రాసిన వారు
Sriram Pranateja
Sep 22, 2023
11:52 am
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు(16) చెన్నైలోని తమ నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. గతకొన్ని రోజులుగా ఒత్తిడికి లోనయిన అమ్మాయి, చివరకు ప్రాణాలు తీసేసుకుంది.
కూతురు మరణంతో విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కూతురు మరణంపై విజయ్ ఆంటోనీ, ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
తన కూతురు ఎంతో ఆప్యాయత గలదని, ఎంతో ధైర్యంగా ఉండేదని, ఇప్పుడు కులం, మతం, బాధ వంటి తేడాలు లేని ప్రదేశంలోకి తాను వెళ్ళిపోయిందని, ఆమెతో పాటు తాను కూడా చనిపోయానని విజయ్ ఆంటోనీ పోస్ట్ పెట్టారు.
తన కూతురు ఇప్పటికీ తనతోనే ఉందనీ, తనతో మాట్లాడుతుందనీ, ఇక నుండి తాను చేసే ప్రతీ సేవాకార్యక్రమాన్ని కూతురి పేరుతోనే మొదలు పెడతాననీ ఆయన రాసుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విజయ్ ఆంటోనీ ట్విట్టర్ పోస్ట్
— vijayantony (@vijayantony) September 21, 2023