Page Loader
Rattam OTT : ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ ర‌త్తం.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా
స్ట్రీమింగ్ ఎందులో తెలుసా

Rattam OTT : ఓటీటీలోకి విజ‌య్ ఆంటోనీ ర‌త్తం.. స్ట్రీమింగ్ ఎందులో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 01, 2023
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజ‌య్ ఆంటోనీ ర‌త్తం సినిమా ఓటిటిలోకి రానుంది. ఈ మేరకు న‌వంబ‌ర్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లోనూ రత్తమ్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశముంది. సీఎస్ ఆముధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన రత్తం, థ్రిల్లింగ్ అనుభూతులనిచ్చింది. మ‌హిమా నంబియార్ విల‌న్ పాత్ర‌లో న‌టించగా, నెగెటివ్ యాంగిల్ పాత్రలో ఆమె నటనకు గాననూ ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. మరోవైపు నందితా శ్వేత‌, ర‌మ్య నంబీశ‌న్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. తాగుడుకు బానిస‌గా మారిన ఇన్వేస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టు పాత్రను విజ‌య్ ఆంటోనీ అద్భుతంగా పోషించాడు.

Details

పరిశోధనా జర్నలిస్టుగా రంజిత్ కుమార్ (విజయ్ ఆంటోని)

ర‌త్తం స్టోరీ ఏంటి : వాన‌మ్ ప‌త్రిక ఏడిట‌ర్ త‌న కార్యాలయంలోనే ఘోర హ‌త్య‌కు గుర‌వుతాడు. హత్యా కేసును టేకప్ చేసే బాధ్య‌త‌ను పరిశోధనా జ‌ర్న‌లిస్ట్, రంజిత్‌ కుమార్ (విజ‌య్ ఆంటోనీ) చేప‌డ‌తాడు. అసలు ఎడిట‌ర్‌ను హతమార్చిందెవరూ, ఈ హత్యతో సంగీత అలియాస్ అన్న‌పూర్ణి (మ‌హిమా నంబియార్‌)కు ఉన్న సంబంధం ఏమిటన్న‌దే ర‌త్తం సినిమా లైనప్. ద‌ర్శ‌కుడు సీఎస్ అముధ‌న్ ఈ సినిమాను నేరపూరితమైన కోణంలో ఉండే వ్యక్తుల గురించి తెర‌కెక్కించాడు. కథాంశం కొత్త‌గా ఉన్నప్పటికీ దాన్ని ఆస‌క్తిక‌రంగా మార్చడంలో రత్తం మిక్స్‌డ్ టాక్‌ను మాత్రమే అందుకోగలిగింది.