LOADING...
Jananayagan: 'జననాయగన్‌' టైటిల్ కార్డులో సీఎం విజయ్‌.. ఆనందోత్సాహంలో అభిమానులు
'జననాయగన్‌' టైటిల్ కార్డులో సీఎం విజయ్‌.. ఆనందోత్సాహంలో అభిమానులు

Jananayagan: 'జననాయగన్‌' టైటిల్ కార్డులో సీఎం విజయ్‌.. ఆనందోత్సాహంలో అభిమానులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఎన్నికల సమయంలో వివాదాల కారణంగా విడుదలకు అవకాశం దక్కని 'జననాయగన్‌' చిత్రం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇది విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిర్ణయించిన సమయంలో విడుదల కాకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో త్వరలో విడుదలవుతుందని భావిస్తున్న ఫ్యాన్స్‌కు చిత్ర బృందం బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'జననాయగన్‌' టైటిల్ కార్డులో దళపతి విజయ్‌ అనే బదులు సీఎం విజయ్‌ అంటూ వేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది ఈ దృశ్యానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

టైటిల్ కార్డు మార్పు చేయాలన్న అభిమానులు.. స్పందించిన చిత్ర బృందం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేపార్టీకి మెజారిటీ స్థానాలు రావడంతో చిత్ర బృందం అభినందనలు తెలియజేసింది. ఇదే సమయంలో కొందరు అభిమానులు టైటిల్ కార్డు మార్పు చేయాలని కోరగా, దానికి స్పందించిన చిత్ర బృందం కొత్త రూపంలో టైటిల్ కార్డును విడుదల చేసింది. అందులో "గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌ నటించిన జననాయగన్‌" అంటూ టైటిల్‌ కార్డు వేసింది

వివరాలు 

పోలీసు దుస్తుల్లో విజయ్

పోలీసు దుస్తుల్లో విజయ్‌ నడుచుకుంటూ వస్తున్న దృశ్యాన్ని అందులో చూపించారు. త్వరలో కలుద్దామంటూ సంబంధిత టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శించారు. మార్చిన టైటిల్ కార్డును చూసిన అభిమానులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతున్నారు. ఎన్నికల విజయంతో పాటు ఈ కొత్త మార్పు వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించింది. కొందరు అభిమానులు ఈ దృశ్యాలను పంచుకుంటూ "భారతదేశంలో ఒక నటుడికి ముఖ్యమంత్రి అనే టైటిల్ కార్డు వినియోగించడం ఇదే మొదటిసారి" అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న 'జననాయగన్‌' టైటిల్ కార్డు

Advertisement